ఓ రేంజ్ లో గోట్ ఓటీటీ రైట్స్ రేటు
తమిళ స్టార్ హీరో విజయ్ కు కొన్నేళ్ల కిందట వరకు వేరే భాషల్లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉండేది కాదు. కానీ తుపాకీ సినిమా తర్వాత విజయ్ మార్కెట్ బాగా పెరిగింది. తెలుగులో విజిల్, మాస్టర్, అదిరింది సినిమాలు కమర్షియల్ గా బాగా వర్కవుట్ అవడంతో విజయ్ సినిమా డబ్బింగ్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. దీంతో డిజిటల్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇప్పుడు విజయ్ చేస్తున్న తాజా సినిమా గోట్ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.110 కోట్ల భారీ రేటుతో నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ కన్ఫర్మే అంటున్నాయి చెన్నై వర్గాలు. ఒక సౌత్ సినిమాకు ఇంత డిమాండ్ అంటే ఆ క్రెడిట్ మొత్తం విజయ్ కే దక్కుతుంది. ఎందుకంటే గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కెరీర్ ట్రాక్ ఏమంత గొప్పగా లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా పెద్దగా ఫామ్ లో లేడు. ఇన్ని అంశాల నడుమ విజయ్ సినిమా ఈ రేంజ్ బిజినెస్ చేస్తుందంటే అది విజయ్ ఇమేజ్ తప్ప మరొకటి కాదు. అంతేకాదు పొలిటికల్ ఎంట్రీకు ముందు విజయ్ చేయబోయే రెండు సినిమాల్లో గోట్ సినిమా ఒకటి. విజయ్ ను తర్వాత మళ్లీ మళ్లీ స్క్రీన్ మీద చూడాలన్నా చూడలేరు కాబట్టి ఈ సినిమాపై మంచ హైప్ నెలకొంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.













