గీత గోవిందం తర్వాత ఆ లిస్ట్‌లోకి ఖుషినే!
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైమ్‌లోనే మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. 10 సినిమాలతోనే విజయ్ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్ఆనడు. ఇప్పటి వరకు విజయ్ నటించిన సినిమాల్లో గీత గోవిందం తప్ప అన్ని సినిమాలు U/A సర్టిఫికేట్ అందుకున్నవే. గీత గోవిందంకు U సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఖుషి సినిమాకు U సర్టిఫికేట్ వచ్చింది.
లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలేమీ లేకుండా ఖుషిని క్లీన్ ఎంటర్టైనర్ గా మలిచాడు శివ నిర్వాణ. రీసెంట్ గా జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో ఖుషి సినిమా తప్పకుండా అందరి హృదయాలను తాకుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. తన గత చిత్రాలైన నిన్ను కోరి, మజిలీ సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందన్నాడు.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కుతుందని ఇప్పటికే ట్రైలర్ ద్వారా అర్థమైంది. సెన్సార్ టీమ్ కూడా ఖుషి సినిమా పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర యూనిట్ అంతా చాలా ఆశలు పెట్టుకుంది.













