నిన్న నాగార్జున, సమంత.. ఈరోజు విజయ్ దేవరకొండ?
లాక్డౌన్ కారణంగా అన్ని కార్యక్రమాలూ గతి తప్పాయి. అనుకున్న టైమ్‌కి ఏదీ జరగడం లేదు. సినిమాల పరిస్థితి అలాగే ఉంది, టీవీ షోల పరిస్థితి కూడా అలాగే ఉంది. లాక్డౌన్ లేకుండా అన్నీ నార్మల్‌గా ఉండి ఉంటే ఈపాటికి బిగ్‌బాస్ సీజన్ 4 స్టార్ట్ అయి ఉండేది. సీజన్ 4కి చాలా గ్యాప్ వచ్చేసరికి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 4కి వ్యాఖ్యాతగా వ్యవహరించే వారి పేర్లు కూడా రోజుకొకటి వినిపిస్తున్నాయి. సీజన్ 1కి ఎన్టీఆర్, సీజన్ 2కి నాని, సీజన్ 3కి నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. నాలుగో సీజన్‌కి హోస్ట్‌గా ఎవరు రాబోతున్నారనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. సీజన్ 4కి కూడా రాబోతున్నాడని మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నాగార్జునకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా బిగ్‌బాస్‌కి వచ్చే అవకాశం లేదని, కాబట్టి నాగార్జున సీజన్ 4 చేయడం లేదని న్యూస్ వచ్చింది. ఆ తర్వాత నాగార్జున కోడలు సమంత పేరు వినిపించింది. సమంత సీజన్ 4కి ఫైనల్ అయిపోయిందన్న రేంజ్లో సోషల్ మీడియాలో ఆమె పేరు హలచల్ చేసింది.
విజయ్ దేవరకొండ సీజన్ 4ని హ్యాండిల్ చేస్తాడంటూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే బిగ్‌బాస్ నిర్వాహకుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసే వారి పేర్లు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. హైపర్ ఆది, మంగ్లీ, బిత్తిరి సత్తి, తరుణ్, నందు, యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత, శ్రద్ధా దాస్, వైవా హర్ష, వర్షిణి ఈసారి పార్టిసిపేట్ చేసే వారిలో ఉన్నారని తెలుస్తోంది.













