రెండు భాగాలుగా విజయ్ మూవీ
ఎప్పుడైతే బాహుబలి సినిమా రెండు పార్టులుగా వచ్చిందో ఆ తర్వాత కొన్ని సినిమాలు దాన్ని ఫాలో అవుతూ తమ సినిమాలను రెండు పార్టులుగా తీసి మంచి క్రేజ్‌తో పాటూ ఊహించని లాభాలను కూడా అందుకున్నారు. దీంతో మిగిలిన అందరికీ సీక్వెల్స్ పై ఆశ పెరిగింది. ముందు సినిమా రిజల్ట్ ను బట్టి సీక్వెల్ ను ప్లాన్ చేయొచ్చులే అనుకుని వాటికి సంబంధించిన హింట్ ను క్లైమాక్స్ లో హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు.
రీసెంట్గా వచ్చిన స్కంద మూవీకి కూడా సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాను రెండు భాగాలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముందు దీన్ని ఒక సినిమాగానే అనుకున్నప్పటికీ స్క్రిప్ట్ డెవలప్ అయ్యాక రెండు పార్టులగా తీయాలని డిసైడయ్యారట.
ఈ కథను ఒక భాగంలో చెప్పలేమని గౌతమ్ నిర్ణయించుకున్నాడని, ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో రెండు పార్టులుగా రానున్న మొదటి సినిమా ఇదే. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.













