విజయ్ లైనప్‌కు మెంటలెక్కడం ఖాయం
ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. లైగర్ తర్వాత విజయ్ కెరీర్లో అతి పెద్ద ఫ్లాప్ ఈ సినిమానే. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మోంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీని తర్వాత విజయ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. పీరియాడికల్ జానర్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.
తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో పీరియాడికల్ జానర్ లో ఓ సినిమాను ఇప్పటికే ఓకే చేశాడు. వీటన్నింటి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. చరణ్ తో సినిమా పూర్తయ్యాక సుకుమార్, విజయ్ తో సినిమాను మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది జరగాలంటే ఎంత లేదన్నా మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఇవి కాకుండా తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తో కూడా చెరో సినిమా చేయాలని చూస్తున్నాడట విజయ్. వారు కూడా విజయ్ తో కలిసి పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదేమైనా విజయ్ లైనప్ చూస్తుంటే మెంటలెక్కడం ఖాయం.













