ఫైటర్ కోసం… సరికొత్త లుక్‌లో
వరల్డ్ ఫేమస్ లవర్ గా విజయ్ దేవరకొండ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఆ సినిమా తర్వాత తను నటించే ఫైటర్‌లో విజయ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. పూరిగారు తెరకెక్కిస్తున్న ఫైటర్ కోసం ఆలిమ్ హకీమ్ విజయ్ దేవరకొండను సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారు. ఆ లుక్ అందరినీ ఆకట్టుకొంటుంది అంటూ ఛార్మీ ట్వీట్ చేశారు. సల్మాన్‌ఖాన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కే కాకుండా ఆర్ ఆర్ ఆర్‌లో రామ్‌చరణ్‌కు హెయిర్ స్టైలిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు ఆలిమ్ హకీమ్. పూరి జగన్నాథ్, ఛార్మి కలసి నిర్మించే ఈ చిత్రంలో కరణ్ జోహర్ కరూడా భాగస్వామి. ఈ చిత్రం కోసం ఎంతో కేర్ తీసుకొని వర్క్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలో జరుగుతుంది.













