విజయ్‌కు హీరోయిన్ దొరికేసింది
లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ మార్కెట్ ఎంతో దెబ్బతింది. ఆ తర్వాత ఖుషి సినిమా కూడా ఓ మోస్తరు ఫలితాన్నిచ్చింది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో అయినా విజయ్ మార్కెట్ పెరుగుతుందనుకుంటే అది కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. దీంతో ఇప్పుడు విజయ్ తన తర్వాతి సినిమా మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాడు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ తన తర్వాతి సినిమాను చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు శ్రీలీలను అనుకున్నారు. ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. కానీ సినిమా అనుకున్న టైమ్ కు స్టార్ట్ అవకపోవడం, హీరోయిన్ కాస్త పాత్ర బోల్డ్ గా ఉండటంతో ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి.
రీజన్స్ ఏవైనా కావొచ్చు కానీ ఈ ప్రాజెక్ట్ లో శ్రీలీల అయితే లేదు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాల్సి రావడంతో గత కొన్నాళ్లుగా హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. మధ్యలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ను అనుకున్నారు. కానీ ఇప్పుడు చివరకు మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. విజయ్ కు జోడీగా భాగ్యశ్రీ అయితే బాగా సెట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.













