విజయ్ ఆంటోనీ ను హీరోగా గుర్తించని గూగుల్
విజయ్ ఆంటోనీ అని చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది బిచ్చగాడు సినిమానే. ఈ సినిమాలో హీరోగా నటించి మంచి మార్కులు వేసుకున్నాడు విజయ్. ఇంతకుముందు మ్యూజిక్ కంపోజర్ గా ఉన్న విజయ్ ఆంటోనీ మొదట్లో క్యామియో రోల్ చేసి ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. 2006లో అతను కిజక్కు కోడల్ కారై సలై అనే సినిమాలో గెస్ట్ రోల్ చేసి నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.
2016లో బిచ్చగాడు సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. విజయ్ చేసే సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. మొదట్లో మ్యూజిక్ కంపోజర్ గా ఉన్న విజయ్, ఇప్పుడు తను హీరోగా నటిస్తున్న సినిమాలకు తనే మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే 2012 నుంచి వరుసగా సినిమాలు చేస్తున్న విజయ్ ని గూగుల్ ఇప్పటికీ మ్యూజిక్ కంపోజర్ గానే గుర్తిస్తుంది తప్పించి నటుడిగా, హీరోగా గుర్తించలేదు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండే గూగుల్ సెర్చ్ ఇంజన్లో విజయ్ నేమ్ వెతికితే ఇప్పటికీ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అనే చూపిస్తుంది. ఇది చూసిన ఆడియన్స్ గూగుల్ విజయ్ విషయంలో ఇంకా అప్డేట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం విజయ్ ఆంటోనీ హత్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.













