Vijay Antony: విజయ్ ఆంటోనీ కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నాడుగా

మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ(Vijay Antony) తన మ్యూజిక్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత బిచ్చగాడు(bichagadu) అనే సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు వచ్చిన మార్కెట్ ను కాపాడుకోవడానికి అతను ఈ క్షణం వరకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
బిచ్చగాడు తర్వాత పలు సినిమాలు చేసినా అవేమీ అతనికి మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఓ రెండు మూడు సినిమాలు యావరేజ్ అనిపించుకున్నాయి కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేదు. అయినప్పటికీ సక్సెస్ తో సంబంధం లేకుండా విజయ్ ఆంటోనీ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఆంటోనీ నటించిన కొత్త సినిమా మార్గన్(Margan) రేపు రిలీజ్ కానుంది.
మార్గన్ సక్సెస్ పై విజయ్ ఆంటోనీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తన సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా ప్రతీ సారీ ఏదొక కొత్త ప్రయత్నం చేస్తూ ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తున్నారు విజయ్. కొత్త కథలు చేసుకుంటూ పోతే ఏదొక సినిమాను ఆడియన్స్ ఆదరించకపోతారా అని కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు విజయ్ ఆంటోనీ. ఈ విషయంలో విజయ్ ఆంటోనీని తప్పక మెచ్చుకోవాలి. మరి మార్గన్ సినిమా అయినా అతనికి కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.