Vijay Antony: బిచ్చగాడు3ని కన్ఫర్మ్ చేసిన హీరో

తమిళ సినిమా అయ్యుండి కూడా తెలుగులో భారీగా ఆడిన సినిమా బిచ్చగాడు(Bichagadu). విజయ్ ఆంటోనీ(Vijay Antony) హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందనను అందుకుంది. బిచ్చగాడు సినిమా హిట్ అవడంతో మేకర్స్ దానికి సీక్వెల్ గా బిచ్చగాడు2(Bichagadu2)ను చేయగా, ఆ సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ బిచ్చగాడు సినిమా లాగా బిచ్చగాడు2 అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించలేకపోయింది. అలా అని ఆ సినిమా ఫ్లాప్ అని కూడా చెప్పలేం. ఆశించిన ఫలితాల్ని అయితే అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే విజయ్ ఆంటోనీ తన తాజా చిత్రం మార్గన్(margan) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిచ్చగాడు ఫ్రాంచైజ్ లో మరో సినిమా రాబోతుందని వెల్లడించారు. అదే బిచ్చగాడు3(Bichagadu3).
బిచ్చగాడు3 సినిమా కోసం విజయ్ డైరెక్టర్ ఏకంగా మెగాఫోన్ పట్టబోతున్నట్టు కూడా ఆయన అనౌన్స్ చేశారు. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రానున్న బిచ్చగాడు3 2027 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్టు ఆయన తెలిపారు. అంటే ఈ క్రేజీ సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందేనన్న మాట. సినిమా సినిమాకీ కొత్త దనం ట్రై చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నించే విజయ్ ఆంటోనీ నటించిన మార్గన్ రేపు థియేటర్లలోకి రానుంది.