Vijay: ఆ డైరెక్టర్ తో విజయ్ 70నా?
ప్రస్తుతం తన కెరీర్లో 69వ సినిమాను చేస్తున్న దళపతి విజయ్(Thalapathi Vijay) ఆ సినిమా తర్వాత సినిమాలకు రిటర్మైంట్ ప్రకటించి పూర్తిగా పాలిటిక్స్ కు పరిమితమవుతానని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీని అనౌన్స్ చేయడం, భారీగా సభ పెట్టడం, అధికార పక్షంపై విమర్శలు చేయడం లాంటివి చేస్తున్నాడు.
కానీ ఇప్పుడు విజయ్ ప్లానింగ్ లో మార్పులొచ్చినట్టు తెలుస్తోంది. ఎలాగూ 69 సినిమాలు చేశాడు కాబట్టి 70వ సినిమా కూడా పూర్తి చేసి విజయ్ జనాల్లోకి వెళ్దామనుకున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్69(Vijay69) సినిమానే లాస్ట్ సినిమా అవుతుందని భావించిన విజయ్ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అదే సమయంలో వారికి పెద్ద నిరాశ కూడా ఉంది. దానికి కారణం విజయ్ తన 70వ సినిమాను వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో చేస్తున్నాడంటున్నారు. ఇప్పటికే తన 68వ సినిమా గోట్(GOAT) ను వెంకట్ ప్రభుతోనే చేసి డిజాస్టర్ అందుకున్నాడు విజయ్. అలాంటి వెంకట్ ప్రభుతో తన ఆఖరి సినిమా చేయడమేంటని ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













