గేమ్ ఛేంజర్ కు పోటీ పెరుగుతుంది!
రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ రిలీజని నిర్మాత దిల్ రాజు చెప్తున్నాడు కానీ ఇప్పటివరకు డేట్ ను మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది లేదు. డిసెంబర్ 20 అని అందరూ అనుకోవడమే తప్పించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. నిన్న విజయ్ సేతుపతి విడుదల-2 డిసెంబర్ 20ని రిలీజ్ డేట్ గా లాక్ చేసుకుంటూ అనౌన్స్మెంట్ వచ్చింది.
తమిళనాడులో గేమ్ ఛేంజర్ కు ఈ సినిమా నుంచి పెద్ద సవాలే ఎదురుకానుంది. అసలే ఇండియన్2 పుణ్యమా అని అక్కడి జనాలకు శంకర్ మీద నమ్మకం పోయింది. ఇలాంటి టైమ్ లో గేమ్ ఛేంజర్, విడుదల2 పోటీ పడితే కచ్ఛితంగా ఓపెనింగ్స్ ఎక్కువగా విడుదల2 కే వస్తాయి. కాబట్టి ఇంకొకరు పోటీకి రాకముందే గేమ్ ఛేంజర్ టీమ్ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ ఇస్తే అందరికీ బావుంటుంది.
లేదంటే మేము ముందే చెప్పామనే ఇతర ప్రొడ్యూసర్ల వాదనకు బదులు మాట్లాడటానికి అవకాశముండదు. అసలే ముఫాసా ది లయన్ కింగ్ తో ఓవర్సీస్ లో థియేటర్ల సమస్య ఉంటుందని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్న టైమ్ లో ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఈ సినిమా పోటీకి దిగింది. మరోవైపు బాలీవుడ్ లో క్రిస్మస్ సీజన్ లోనే వరుణ్ ధావన్ బేబీ జాన్ కూడా వస్తోంది. టాలీవుడ్ నుంచ రెండు వారాల ముందు పుష్ప2 రిలీజ్ కానుంది. అది బ్లాక్ బస్టర్ అయితే కనీసం 4 వారాల పాటూ థియేటర్లలో నుంచి తీసేయడానికి ఎగ్జిబిటర్లు ఇంట్రెస్ట్ చూపించరు. వినాయక చవితికి ఏదోక కంటెంట్ ఇవ్వాలని చూస్తున్నారట. మరి ఆ రోజైనా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తారేమో చూడాలి.













