విఐ ఆనంద్ కు బంపరాఫర్
హృదయం ఎక్కడున్నది సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన విఐ ఆనంద్ ఆ సినిమా తో అంతగా తన టాలెంట్ ను నిరూపించుకోలేకపోయాడు. తర్వాత తమిళంలో అప్పూచి గ్రామం అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో ఆయన నుంచి టైగర్, ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి సినిమాలొచ్చాయి.
రీసెంట్ గా ఆయన నుంచి ఊరు పేరు భైరవకోన అనే సినిమా వచ్చింది. సినిమాల రిజల్ట్ గురించి పక్కన పెడితే విఐ ఆనంద్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తాడనే పేరును సంపాదించుకున్నాడు. అయితే త్వరలోనే విఐ ఆనంద్ ఓ స్టార్ హీరోను డైరెక్టర్ చేయబోతున్నాడు. అనిల్ సుంకర నిర్మాతగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ రెడీ అయింది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇందులో నటించే హీరో పేరు చెప్పలేదు కానీ పెద్ద హీరో సినిమా అంటూ హింట్ ఇచ్చారు. అంతే కాదు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన విఐ ఆనంద్ తనకొచ్చిన అవకాశాన్ని వాడుకుని ఈసారి మంచి హిట్ అందుకుంటే ముందుముందు పెద్ద హీరోలతో చేసే అవకాశాలు మరిన్ని వస్తాయి.













