Venu Yeldhandi: వేణు ముందు పెద్ద ఛాలెంజ్
కమెడియన్ గా చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన జబర్దస్త్ వేణు(Jabardasth Venu) అతనిలో మంచి డైరెక్టర్ ఉన్నాడని బలగం(Balagam) సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా చేయడమే కాకుండా అందరూ చాలా కాలం పాటూ గుర్తు పెట్టుకునే సినిమాను తీశాడు వేణు. బలగం సినిమా తర్వాత వేణు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
బలగం సినిమాకు దిల్ రాజు(Dil Raju) వెనుక నిలబడి తన పిల్లల్ని ముందు ఉంచాడు. కానీ ఈసారి వేణు రెండో సినిమా ఎల్లమ్మ(Yellamma)కు ఏకంగా దిల్ రాజే బరిలోకి దిగుతున్నాడు. ఎల్లమ్మ తల్లి కథా నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తైందని, త్వరలోనే సినిమా మొదలుపెడతామని వేణు చెప్పాడు. ఎల్లమ్మలో నితిన్(Nithin) హీరోగా నటిస్తున్నాడు.
టైటిల్ రోల్ లో సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తుందనే వార్త బాగా వినిపిస్తోంది. సాయి పల్లవి లాంటి స్టార్స్ ను హ్యాండిల్ చేయడం వేణు కు కాస్త కష్టమే అయినప్పటికీ ఆ పాత్రని వారికి ఎక్కిస్తే మాత్రం తను వండర్స్ క్రియేట్ చేయగలడు. సాయి పల్లవి ఈ సినిమా చేస్తే మాత్రం ఎల్లమ్మ కు మొదటి నుంచే భారీ హైప్ రావడం ఖాయం. ఈ సినిమా కోసం వేణు అడిగినంత బడ్జెట్ ను ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యాడు.













