Venkatesh: వెంకీ నెక్ట్స్ ఎవరితో?
ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki Vasthunnam) సినిమా చేస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తన తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నారనేది ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికైతే ఆయన దగ్గర రెండు ఆప్షన్లున్నాయి. అందులో మొదటిది సామజవరగమన(Samajavaragamana) రైటర్లలో ఒకరైన నందు(Nandhu)తో సినిమా. వెంకీకి నందు చెప్పిన కథ బాగా నచ్చిందని టాక్.
నందు సినిమాను సురేష్ బాబు(Suresh Babu), వెంకీ(Venky) ఓకే చేశాక మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది కాకుండా డీజే టిల్లు(DJ Tillu) డైరెక్టర్ విమల్ కృష్ణ(Vimal Krishna) చెప్పిన స్టోరీ లైన్ కూడా వెంకీకి బాగా నచ్చిందని, దానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని అంటున్నారు. ఈ సినిమా కూడా ఫన్ తో కూడిన యాక్షన్ మూవీగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమా ఎవరు నిర్మిస్తారనేది ఇంకా తెలియదు కానీ టాలీవుడ్ లోని టాప్ బ్యానరే అంటున్నారు. అయితే ప్రస్తుతం వెంకీ తన ఫోకస్ అంతా కామెడీ ఎంటర్టైనర్లపైనే పెట్టాడని, తన ఏజ్ కు సూటవ్వని యాక్షన్ ను కొంత కాలం పక్కన పెట్టాలని డిసైడయ్యాడట. మరి ఈ రెండు సినిమాల్లో వెంకీ ఏ సినిమాను ముందు మొదలుపెడతాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో వెంకీ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.













