VD12: త్వరలోనే విజయ్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్
రౌడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. ప్రస్తుతం విజయ్ జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తన 12వ సినిమాను చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో నాగవంశీ(Naga Vamsi) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మార్చి 28న రిలీజ్ కానున్న వీడీ12(VD12)లో భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri Borse) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైనా ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే విజయ్ ఫ్యాన్స్ కు నిర్మాణ సంస్థ త్వరలోనే ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా నుంచి క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కు టీజర్(VD12 Teaser) రానుందని టాక్ వినిపిస్తోంది. టీజర్ తోనే ఈ సినిమాపై బజ్ పెంచాలని దర్శకనిర్మాతలు చూస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ ఈ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా(ravi kiran kola)తో ఓ సినిమా, రాహుల్ సాంకృత్స్యన్(rahul Sankrityan) తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.













