VD12: వీడీ12 వాయిదా వెనుక రీజనేంటి?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో చేస్తున్న వీడీ12(VD12) సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మే 30న వీడీ12(VD12)ను రిలీజ్ చేయాలని మేకర్స్ డెసిషన్ తీసుకున్నారట.
వాస్తవానికి ఈ సినిమాను ముందుగా మార్చి నెలాఖరుకు ప్లాన్ చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సినిమాను మే నెలకు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం పోటీనే. మార్చి, ఏప్రిల్ నెలల్లో పోటీ తీవ్రంగా ఉంది. వీడీ12 కోసం భారీ బడ్జెట్ ను ఖర్చు చేశారు. దాన్నంతటినీ రికవర్ చేయాలంటే సినిమాకు సోలో రిలీజ్ ముఖ్యం.
అసలే ఈ మధ్య సితార బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలకు మంచి టాక్ వస్తున్నా పోటీ వల్ల కలెక్షన్లు ప్రభావితం అవుతున్నాయి. డాకు మహారాజ్(Daku Maharaj) పై సంక్రాంతి కి వస్తున్నాం(Sankranthiki Vasthunnam), లక్కీ భాస్కర్(Lcuky Baskhar) కు అమరన్(Amaran), గుంటూరు కారం(Gunturu Karam)ను హనుమాన్(Hanu Man) సినిమాల వసూళ్లు బాగా ప్రభావితం చేశాయి. అందుకే మరోసారి అలాంటి ఇబ్బంది ఎదుర్కోకూడదని నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.













