విశ్వంభరకు వశిష్టుడి ఎలివేషన్లు
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని మరీ చిరంజీవి తన తర్వాతి సినిమా విశ్వంభరను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్, బింబిసార ఫేమ్ వశిష్టతో చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ వశిష్ట ఫ్యాన్స్ కు జోష్ ఇచ్చే మాటలు చెప్పాడు.
చిరూ బర్త్ డే సందర్భంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విశ్వంభరుడు అనే ఆన్లైన్ ప్రోగ్రాంకు గెస్ట్ గా వచ్చిన వశిష్ట, విశ్వంభర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా గురించి ఎంతైనా ఊహించుకోమని, అంతకు పదింతలు ఎక్కువ శాటిస్ఫై చేసేలా ఓ ఫ్యాన్స్ గా సినిమాను తీశానని వశిష్ట చెప్పాడు.
ఇప్పటివరకు చిరూతో ఎవరూ చేయని సబ్జెక్టును తాను హ్యాండిల్ చేసినట్లు చెప్పిన వశిష్ట, ఇందులో ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూస్తారని, కచ్ఛితంగా ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని తెలిపాడు. త్వరలోనే టీజర్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని వశిష్ట చెప్పాడు. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న విశ్వంభర కచ్చితంగా పండగ విజేతగా నిలుస్తుందని డైరెక్టర్ వశిష్ట చెప్పడం చూస్తుంటే మూవీలో కంటెంట్ గట్టిగానే ఉన్నట్లనిపిస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.













