హీరో సిద్ధార్థ్ ‘టక్కర్’ ఫస్ట్ లుక్
సిద్థార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్ టైటిల్ పోస్టర్ను వరుణ్ తేజ్ విడుదల చేశారు. సిద్థార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరిలో ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. గతంలో కప్పల్, పాండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రాన్ని స్వరాలు సమకూరుస్తున్నారు.













