వరుణ్ లైన్లో మరో రెండు సినిమాలు
గని(Gani), గాండీవదారి అర్జున(Gandeevadhari Arjuna), ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) సినిమాలతో వరుస డిజాస్టర్లు అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Mega Prince Varun Tej) ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో ట్రెండ్ కు తగ్గట్టు పీరియాడికల్ జానర్ మూవీ చేస్తున్నాడు. కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో మట్కా(matka) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో రిలీజ్ కానుంది.
మట్కాలో వరుణ్ క్యారెక్టర్ మూడు వేరియేషన్స్ లో చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మట్కా తర్వాత వరుణ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్(venkatadri Express) ఫేమ్ మేర్లపాక గాంధీ(merlapaka Gandhi) దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు కనకరాజు(kanakaraju) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ సౌత్ కొరియాలో ఎక్కువగా జరగనుందట. ప్రస్తుతం వీసా ప్రాసెసింగ్ అవుతున్నట్లు సమాచారం. తమన్(thaman) సంగీతం అందించనున్న ఈ సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్లు టాక్. ఇక రెండో సినిమా విక్రమ్ సిరికొండ(vikram Sirikonda) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(mythri Movie Makers) లో రానుంది. నెక్ట్స్ ఇయర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న ఈ సినిమా అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుందట. మరి ఈ సినిమాలు వరుణ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.













