మరింత లేట్‌గా రానున్న సిటాడెల్
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. వాస్తవానికి ఈ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ కు మాత్రం ప్రైమ్ చాలా టైమ్ తీసుకుంది. ఇంతకాలం వెయిట్ చేసి, సరిగ్గా యానిమల్ థియేటర్లలోకి వచ్చే రోజునే ఈ సిరీస్ ను రిలీజ్ చేయడం వల్ల ఇంకా దూత ఆడియన్స్ లోకి సరిగా వెళ్లలేదు.
అయితే చైతూలానే సమంత కూడా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కూడా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ రిలీజ్ మాత్రం ఇంకా అవలేదు. రాజ్ అండ్ డీకే రూపొందించిన సిటాడెల్ కోసం సమంత ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ సిటాడెల్ ను 2024 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
ప్రియాంక్ చోప్రా నటించిన సిటాడెల్ ఒరిజినల్ అయిన ఇంగ్లీష్ వెర్షన్ కు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్ కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. అందులో భాగంగానే పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో విదేశాల్లో కూడా షూట్ చేశారు.













