Varsha Bhararath: బూతు సినిమా తీశానన్నారు

కోలీవుడ్ మూవీ బ్యాడ్ గర్ల్(Bad Girl) టీజర్ రిలీజయ్యాక చాలా వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మూవీలో బ్రాహ్మణులను చెడుగా చూపిస్తున్నారని చిత్ర నిర్మాతలైన అనురాగ్ కశ్యప్(Anurag Kashyap), వెట్రిమారన్(Vetriman) పై పలువురు ఆరోపణలు చేయడంతో ఆ టీజర్ ను యూట్యూబ్ నుంచి కూడా తొలగించారు. ఆఖరికి ఎన్నో విమర్శలు, వివాదాలు, ఆరోపణలు, కోర్టు తీర్పుల తర్వాత సెప్టెంబర్ 5న సినిమా రిలీజైంది.
వెట్రిమారన్ శిష్యురాలైన వర్షా భరత్(Varsha Bharath) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఈ నెల 26న బ్యాడ్ గర్ల్ బాలీవుడ్ లో రిలీజవుతుంది. తాజాగా వర్షా భరత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను తీసిన సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో పాటూ అవార్డు కూడా గెలుచుకుందని, కానీ ఇండియాలో మాత్రం ఈ సినిమా టీజర్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది.
బ్యాడ్ గర్ల్ టీజర్ చూశాక తానో బూతు సినిమా తీసినట్టు చూశారని, సినిమా తమిళంలో రిలీజయ్యాక ఆడియన్స్ బావుందని చెప్పడంతో ధైర్యమొచ్చిందని, ఆ తర్వాత కొన్నాళ్లకు ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే వాళ్లు కూడా సినిమా చూశాక తనను విమర్శించలేదని, దీంతో సినిమా బావుందని తెలిసిందని, అదే టైమ్ లో ప్రజల ఆలోచనా విధానం కూడా తనకు అర్థమైనట్టు వర్ష చెప్పారు.