Varanasi: ఈ లీకుల బెడద ఆగేదెప్పటికి?
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వారణాసి(varanasi) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. రీసెంట్ గా మేకర్స్ టైటిల్ తో పాటూ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేయగా, ఆ ఈవెంట్ కు అందరి నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(priyanka chopra) హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీ రాజ్ సుకుమారన్(prithvi raj sukumaran) విలన్ పాత్ర పోషించనున్నారు. ఆల్రెడీ వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను కూడా జక్కన్న(jakkanna) రివీల్ చేశారు. ఇదిలా ఉంటే వారణాసి ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ ఓ బుల్ పై త్రిశూలాన్ని పట్టుకుని స్వారీ చేస్తూ కనిపించగా, రుద్ర(Rudra) లుక్ లో మహేష్ అదిరగొట్టాడని అందరూ ప్రశంసించారు. అసలే ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు లీకులు రాగా, రీసెంట్ గా మరోసారి వారణాసి సెట్ నుంచి ఓ లీక్ రావడం అటు చిత్ర యూనిట్ కు, ఇటు మహేష్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ లీకులను రాజమౌళి ఎలా అయినా అరికట్టాలని చూస్తున్నప్పటికీ లీకుల బెడద మాత్రం తగ్గడం లేదు.






