‘వకీల్ సాబ్’ హిట్ కు..తిరుపతి లో విజయానికి సంబంధం ఏంటో నాకర్ధం కావడం లేదు : మంత్రి పేర్ని నాని
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ” వకీల్ సాబ్ ” చిత్రం పోలిటికల్ హిట్ ను పెంచుతుంది. వకీల్‌సాబ్ బెనిఫిట్‌షోలు వేయడానికి ప్రభుత్వం కావాలనే అనుమతివ్వలేదంటూ బీజేపీ కార్యకర్తలు ఉదయం ధియేటర్వద్ద నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ పవన్ కు మాత్రమే కాకుండా, ఇప్పుడు ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నారని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ వ్యాఖ్యానించారు.
ఇక ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఎవరిని దోచుకోవడానికి ‘వకీల్ సాబ్ ‘ బెనిఫిట్ షో లకు పర్మిషన్ కోరారని ఆయన అన్నారు. బీజేపీ నేత సునీల్ ధేవ్ ధర్ సినిమా గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షో ధర ఎంతో మీకు తెలుసా..? గతంలో పవన్ బీజేపీ పార్టీని, ఆయా నేతలను తిట్టిన సంగతి మర్చిపోయారా..? అంటూ పేర్ని నాని అన్నారు. ‘వకీల్ సాబ్’ హిట్ కు..తిరుపతి లో విజయానికి ఏమైనా సంబంధం ఉందా.? ప్రజలు అంతా పిచ్చోళ్ళు కాదు సినిమా చూసి వేయడానికి అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.













