వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ అదేనా..?
పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయి వ్యూస్, లైక్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ కోర్డ్ డ్రామాలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. లాయర్ పాత్ర కావడంతో పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్స్ సీన్స్ ఏమీ లేవని ట్రైలర్ చూడగానే ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉండేలా డైరక్టర్ ప్లాన్ చేశాడని తెలుస్తుంది.
ట్రైలర్ చూస్తుంటే, ఇదొక మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాగా చెప్తున్నప్పటికీ ఫైట్ సీన్స్ చూపించి హింట్ ఇచ్చారు. అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు రిలేటెడ్ గా ఒక్క సీన్ కూడా రివీల్ అవకుండా ఎంతో కేర్ తీసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో పవన్ లా స్టూడెంట్. తర్వాత శ్రుతి హాసన్ తో లవ్ ట్రాక్, స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడే పేదవారికి సాయం చేయడం.. ఆ టైమ్ లోనే సత్యమేవ జయతే సాంగ్ రానుందట. హీరో హీరోయిన్ల మధ్య కంటి పాపా సాంగ్ వచ్చేలా డైరక్టర్ ప్లాన్ చేసుకున్నాడని సన్నిహితులు చెప్తున్నారు.
అంతేకాదు, హీరోయిన్ కు దూరమయ్యాక పవన్ లాయర్ ప్రాక్టీస్ కు కూడా దూరమవుతాడని, ఆ తర్వాత ఈ ముగ్గురు నిస్సహాయులైన అమ్మాయిలను చూసి మళ్లీ నల్ల కోటు వేస్తాడని తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఇదే ఫ్లాష్ బ్యాక్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తుండగా, థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.













