విశ్వంభర రిలీజ్ వెనుక యువి స్ట్రాటజీ
భోళా శంకర్ తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. బింబిసారతో బ్లాస్ బస్టర్ అందుకున్న వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లోకి చిరంజీవి ఇంకా అడుగు పెట్టనే లేదు అప్పుడే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడు పోయినట్లు వార్తలొస్తున్నాయి.
అంతే కాదు రిలీజ్ డేట్ కూడా జనవరి 10 అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మేకర్స్ ఈ రిలీజ్ డేట్ నే ఎంచుకోవడానికి ఎంతో స్ట్రాంగ్ రీజన్ ఉంది. పదో తేదీ శుక్రవారం. అంటే ఆ రోజు మొదలు కనుమ వరకు వరుసగా సెలవలు ఉంటాయి. సంక్రాంతి రేసులో అందరికంటే ముందొస్తే థియేటర్లు ఎక్కువగా దొరుకుతాయి. మంచి టాక్ వస్తే ఇక కలెక్షన్స్ ఊచకోత చూడొచ్చు.
ఇప్పటి వరకు జరిగిన విశ్వంభర షూటింగ్ లో కేవలం కీలక ఆర్టిస్టులు మాత్రమే పాల్గొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చిరూ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. సుమారు విశ్వంభర కోసం 13 సెట్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్స్ కోసమే ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు టాక్. తర్వాత విఎఫ్ఎక్స్ కు అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. విశ్వంభర కోసం మొత్తం రెండు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి యువి క్రియేషన్స్ సిద్ధంగా ఉంది. సినిమాకు మంచి టాక్ వచ్చి హిట్ అయితే బడ్జెట్ కు రెండింతలు రాబట్టుకోవచ్చన్నది యువి నిర్మాతల ప్లాన్.













