Andhra King Taluka: రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్ పూర్తి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఉత్సాహాన్ని పెంచింది.
తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్‌లోని సెట్లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై దీనిని చిత్రీకరించారు.
ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ” షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా… మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్ కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా మీ ముందుకు వస్తోంది’
ఇప్పుడు సినిమా టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషనల్ క్యాంపైన్‌పై ఫోకస్ చేస్తోంది. రామ్‌తో పాటు మొత్తం టీం ఈ చిత్రం కోసం చాలా ఉత్సాహంగా పనిచేశారు. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి చాలానే సవాళ్లు ఎదురైనా, వారు ఆ ప్రాసెస్ ఆస్వాదించారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వివేక్ & మర్విన్ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.







