కాంతార 2 లో అలరించబోతున్న బాలీవుడ్ భామ..!
రిషబ్ శెట్టి తీసిన కాంతార సినిమా గత కొద్ది రోజుల క్రితం వరకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిందన్న విషయం తెలిసిందే. కన్నడలో విడుదలైన ఈ చిత్రం పలు భాషలలో డబ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని వరాహ రూపం సాంగ్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ సాంగ్ మీద వచ్చిన కాంట్రవర్సీ కూడా సినిమాకి ప్లస్ అయిందనే చెప్పొచ్చు. అన్ని తానై రిషబ్ శెట్టి కాంతార చిత్రాన్ని తెరకెక్కించారు. 16 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ళని సాధించడం విశేషం.
అయితే త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా కాంతార 2 కూడా రాబోతుందని రిషబ్ ఆల్రెడీ అనౌన్స్ చేసారు. అయితే కాంతార స్టోరీ కి ముందు ఏం జరిగిందో ఈ సినిమాలో చూపిస్తారట. సో, నెక్స్ట్ వచ్చే సినిమాని సీక్వెల్ గా కంటే ప్రీక్వెల్ గా పరిగణించాల్సి ఉంటుందని ఇండస్ట్రీ లో టాక్. ప్రస్తుతం నెట్టింట ఈ అనౌన్స్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రీక్వెల్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసుకొని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు మేకర్స్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడ్తుంది. బాలీవుడ్ అందాల భామ ఊర్వశి ఈ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలని నిజం చేస్తూ కాంతారా మేకర్ రిషబ్ శెట్టితో కాంతార 2 లో తాను నటిస్తున్నట్టు ఈ అమ్మడు కన్ఫర్మ్ చేసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఊర్వశి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య మూవీ తో బాస్ తో అదరగొట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ మరొకసారి కాంతార 2 అంటూ ప్రేక్షకులని పలకరించబోతుంది. ఇక రిషబ్, ఊర్వశి కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













