Christmas Clash: ఛాంపియన్ కు, టైసన్ నాయుడుకి మధ్య పోటీ

ఒక సినిమా వాయిదా పడటం వల్ల ఆ ఎఫెక్ట్ ఎన్నో సినిమాలకు ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్(Adivi sesh) హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్(Dacoit) క్రిస్మస్ బరి నుంచి తప్పుకుంది. దీంతో ఆ డేట్ ను వాడుకోవడానికి ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. వాళ్లే రోషన్(Roshan), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas). ఇంకా షూటింగ్ పూర్తవని నేపథ్యంలో డెకాయిట్ క్రిస్మస్ నుంచి పోస్ట్ పోన్ అవుతుంది.
దీంతో అదే రోజున తన సినిమాను రిలీజ్ చేయాలని మేక రోషన్ ప్లాన్ చేసుకున్నాడు. శ్రీకాంత్(srikanth) కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన రోషన్ నుంచి గత నాలుగేళ్లుగా సినిమా రాలేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా రోషన్ కంబ్యాక్ ఇవ్వాలని చాలా కసిగా ఉన్నాడు. స్వప్న సినిమాస్ బ్యానర్(swapna cinemas) లో ఛాంపియన్(Champion)అనే స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నాడు రోషన్.
మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గానే కిష్కింధపురి(kishkindhapuri) మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. కిష్కింధపురి తో వచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని డిసెంబర్ 25న టైసన్ నాయుడు(Tyson Naidu) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సాగర్ కె చంద్ర(Sagar K Chandra) దర్శకత్వంలో వస్తోన్న టైసన్ నాయుడు మూవీ షూటింగ్ ఆఖరి దశలో ఉంది. మరి ఈ రెండు సినిమాలతో క్రిస్మస్ బరిలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.