మరోసారి వీరమల్లుపై ట్రోల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికి నాలుగేళ్లవుతుంది. అనౌన్స్ చేసిన కొన్నాళ్లకే షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికీ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయం ఎంతకీ అంతు పట్టడం లేదు. పవన్ ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన చాలా సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి కానీ ఈ సినిమాకు మాత్రం మోక్షం దక్కట్లేదు.
హరిహర వీరమల్లు అనేది చాలా పెద్ద సినిమా. తనకున్న కమిట్మెంట్స్ వల్ల పవన్ ఈ సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ లేటవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ సినిమా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతుంది. మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో హరిహర వీరమల్లు పోస్ట్ రిలీజ్ డిజిటల్ రైట్స్ తమవే అని అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజవుతుందో కూడా తెలియని సినిమా డిజిటల్ రైట్స్ కొని డిజిటల్ రిలీజ్ గురించి అనౌన్స్ చేస్తున్నారా అని ప్రైమ్ వాళ్లపై కూడా పంచులు వేసేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయని తెలిసి కూడా ఆ చిత్ర యూనిట్ ధైర్యంగా అమెజాన్ మీట్ కు అటెండ్ అయి, స్టేజ్ మీద నిలబడింది. ఈ విషయంలో వీరమల్లు టీమ్ ను కచ్ఛితంగా అభినందించాల్సిందే.













