మరోసారి ట్రోలింగ్‌కు గురికానున్న త్రివిక్రమ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మీద ఈ మధ్య నెగిటివిటీ బాగా ఎక్కువైపోయింది. ఆయన తన స్థాయి సినమాలు తీయడం లేదని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది త్రివిక్రమ్ రచన అందించిన బ్రో సినిమా, ఈ ఏడాది గుంటూరు కారం సినిమాలు ఆడియన్స్ ను బాగా నిరాశ పరిచాయి. త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఖలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా విషయంలో ఆయనను ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు. కారణం ఆ సినిమాలోని కంటెంట్.
కానీ ఇప్పుడు గుంటూరు కారం విషయంలో మాత్రం ఆడియన్స్ ఆయన్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అజ్ఞాతవాసి టైమ్ లో త్రివిక్రమ్ ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్నాడో ఇప్పుడు కూడా అలాంటి ట్రోల్సే ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గుంటూరు కారం, అజ్ఞాతవాసి అంత దారుణంగా ఏముండదు. కానీ కథ విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా సరైన శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించదు.
తీసిన కథనే మళ్లీ తీశాడని, మహేష్ లాంటి స్టార్ హీరోను ఎలా వాడుకోవాలో కూడా త్రివిక్రమ్ కు తెలియలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ మాటలను తట్టుకోలేక త్రివిక్రమ్ గుంటూరు కారం రిలీజయ్యాక ఎవరికీ కనిపించకుండా అమెరికా చెక్కేశాడు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అంటే మరోసారి త్రివిక్రమ్ పేరు నెట్టింట వైరల్ అవడం ఖాయం. థియేటర్లలో సినిమాను చూడని వారంతా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసిన వాళ్లు కూడా చిన్న చిన్న లోపాలను వెతకడానికి రెడీ గా ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పేరు మరో సారి మార్మోగడం గ్యారెంటీ.













