త్రివిక్రమ్ అందుకు ఒప్పుకుంటాడా?
దేశంలోనే భారీ బడ్జెట్ తో రూపొందనున్న రామాయణం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాకుండానే ఎన్నో రకాల వార్తలు దీని గురించి నెట్టింట ప్రచారమవుతున్నాయి. సినిమా ఉండటం పక్కా కానీ అది ఎప్పుడు మొదలవుతుంది? అందులో ఎవరెవరు నటిస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకైతే రాముడిగా రణ్బీర్, సీతగా సాయి పల్లవి పేర్లు మాత్రమే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
రామాయణాన్ని తీసేది హిందీలో అయినా ప్రతి భాషకు అనువాదాన్ని మాత్రం చాలా స్పెషల్ కేర్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు సంభాషణల కోసం మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వేరే సినిమాలకు రాయడం మానేశాడు. మధ్యలో జై చిరంజీవ, మొన్నీ మధ్య భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు మాత్రం తన కలాన్ని కదిపాడు.
అలా చేస్తే డబ్బింగ్ సినిమా అవుతుంది కాబట్టి త్రివిక్రమ్ ఒప్పుకునే ఛాన్స్ ఉండదు. కానీ నితీష్ ఆలోచనా విధానం వేరేలా ఉంది. అవసరమైతే రామాయణాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వేర్వేరుగా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. అలా జరిగితే త్రివిక్రమ్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. పురాణాల మీద విపరీతమైన పట్టున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు పని చేయాలే కానీ ఎన్నో అద్భుతమైన మాటలు మనం వినే అవకాశం దక్కుతుంది. ఈ విషయం టీమ్ నుంచి అధికారికంగా బయటకు రాలేదు కానీ ఆలోచనకే చాలా బాగుంది.













