బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు ముహుర్తం ఫిక్స్?
మహేష్ బాబు తో గుంటూరు కారం చేసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ బయట కనిపించింది లేదు. తన తర్వాతి సినిమా ఎవరితో అని అడుగుదామంటే ఎక్కడనా కనిపిస్తేగా.! అయితే త్రివిక్రమ్ నెక్ట్స్ చేయబోయే సినిమా బన్నీతోనే అనే క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. ప్రస్తుతం పుష్ప2 చేస్తున్న బన్నీ ఆ తర్వాతి సినిమాను అట్లీతో చేద్దామనుకున్నాడు.
కానీ ఆ సినిమా సెట్ అవక ఆగిపోయింది. ఇప్పటికే బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌నే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఈ సినిమాను త్రివిక్రమ్ నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా మైథాలజీ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ తో రానుందని టాక్.
అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నారట. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసేలా గురూజీ ప్లాన్ చేస్తున్నాడట. తన నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో త్రివిక్రమ్ దీన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు.













