స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనున్న త్రిష
అందాల తార త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకెళ్తోంది. పొన్నియన్ సెల్వన్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన త్రిష ఆ సినిమా సక్సెస్ తో మంచి ఆఫర్లు అందుకుంటూ బిజీ నటిగా మారింది. కోలీవుడ్ తో పాటూ మాలీవుడ్ లో కూడా త్రిష అడుగు పెట్టింది. ప్రస్తుతం త్రిష టివినో థామస్ తో ఐడెండిటీ అనే సినిమా చేస్తోంది.
టాలీవుడ్ లో కూడా త్రిష పలు క్రేజీ ఆఫర్లు పట్టేసింది. బాలీవుడ్ లో కూడా కంబ్యాక్ కు రెడీ అవుతున్న త్రిష, దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ తిరిగి బాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న త్రిష, విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ది బుల్ అనే సినిమాలో నటించడానికి ఎంపికైంది.
ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. త్రిషకు ఇది రెండో బాలీవుడ్ సినిమా. మొదటి సినిమా అక్షయ్ కుమార్ తో కలిసి కట్టా మిట్టా చేసింది. ఆ సినిమా బాగా పెర్ఫార్మ్ చేయకపోవడంతో అక్కడ త్రిషకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఇప్పుడు మళ్లీ 13 ఏళ్ల తర్వాత త్రిష బాలీవుడ్ లో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మొత్తానికి త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటుకుంటోంది.













