విశ్వంభరకు త్రిష బాగానే డిమాండ్ చేస్తుందిగా!
ఇరవై ఏళ్ల కిందట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ ఆడియన్స్ మనసులో తన స్థానాన్ని అంతే ముద్రించుకుంది. సినిమాలకు గ్యాప్ వచ్చినప్పుడు కూడా త్రిష తన అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఆ జాగ్రత్తే ఇప్పుడు త్రిషకు డిమాండ్ పెరిగేలా చేస్తుంది. ఈ మధ్య త్రిష లుక్స్ చూసిన వారంతా ఇంతకు ముందుకంటే ఇప్పుడే అమ్మడు అందంగా ఉందంటున్నారు.
పొన్నియన్ సెల్వన్ సినిమాలతో పాటూ లియో లో కూడా త్రిష ఎంతో అందంగా కనిపించింది. ఈ క్రేజ్ తోనే త్రిషకు టాలీవుడ్ లో ఛాన్సులు వస్తున్నాయి. త్రిషకు ఇంతకుముందే టాలీవుడ్ నుంచి ఆఫర్లొచ్చినప్పటికీ అప్పుడు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు చిరూతో కలిసి నటించడానికి విశ్వంభర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్రిష.
విశ్వంభరలో త్రిషనే మెయిన్ హీరోయిన్. ఈ సినిమా కోసం త్రిష భారీగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కోలీవుడ్ లో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటున్న త్రిష, విశ్వంభర కోసం మరో కోటిని ఎక్కువ అడిగిందట. సినిమాకు త్రిష గ్లామర్ యాడ్ అవుతుందనే నేపథ్యంలో మేకర్స్ అమ్మడుకు రూ.3 కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. విశ్వంభర హిట్ అయితే త్రిషకు టాలీవుడ్ నుంచి మరిన్ని క్రేజీ ఛాన్సులొచ్చే అవకాశముంది.













