ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా త్రిష?
వర్షం సినిమాతో 20 ఏళ్ల కిందట తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన జంట ప్రభాస్, త్రిష. టాలీవుడ్ బెస్ట్ పెయిర్స్ లో వీళ్ల పేర్లు తప్పకుండా ఉంటాయి. వర్షం తర్వాత వీరిద్దరి కలయికలో పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వీరు కలిసి సినిమా చేసింది లేదు. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ చాలా పెరిగింది. త్రిష కూడా మంచి సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గతేడాది తమిళ టాప్ హీరో విజయ్ తో లియో చేసిన త్రిష, అజిత్ తో విడాముయార్చి, కమల్‌తో థగ్ లైఫ్, చిరంజీవితో విశ్వంభర సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలన్నీ ఒకెత్తయితే త్రిష, ప్రభాస్ తో సినిమా చేస్తే మరో ఎత్తవుతుంది.
ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ లో త్రిష నటించనుందనే వార్త ఇప్పుడెంతో ఎగ్జయింట్ గా అనిపిస్తుంది. సందీప్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. కాకపోతే ఆయన సినిమాల్లో కొన్ని ఇంటెన్స్ సీన్లుంటాయి. ఆ సీన్స్ అందరూ హీరోయిన్లు చేయలేరు. మరి త్రిష ఈ వయసులో సందీప్ సినిమాలో నటిస్తుందా లేదా అన్నదే డౌట్. ఒకవేళ త్రిష ఈ సినిమా ఒప్పుకుంటే మాత్రం నటిగా అమ్మడుకి మంచి పేరు తెచ్చుకునే ఛాన్సుంటుంది.













