Suriya: సూర్య కోసం బాలీవుడ్ భామ?
టాలీవుడ్ స్థాయి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇతర భాషలకు సంబంధించిన నటులు కూడా మన భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు హీరోలు తెలుగులో నటించగా, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya) తెలుగులో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి(Venky atluri) దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మమతా బైజు(mamitha byju) హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ మూవీలో మరో హీరోయిన్ అది కూడా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన త్రిప్తి డిమ్రి(Tripti Dimri).
సూర్య- వెంకీ అట్లూరి సినిమాలో త్రిప్తి డిమ్రి నటిస్తుందని, కాకపోతే ఆమె మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. కాగా ఈ మూవీకి విశ్వనాథన్ అండ్ సన్స్(Viswanathan and sons) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. జి. వి ప్రకాష్ కుమార్(GV Prakash kumar) సంగీతం అందిస్తున్నాడు.







