Toxic: మోస్ట్ వైలెంట్‌గా టాక్సిక్ టీజర్
గీతూ మోహన్‌దాస్(geethu mohandas) దర్శకత్వంలో, కన్నడ రాక్ స్టార్ యష్(Yash) హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా టాక్సిక్(Toxic) పై ఆడియన్స్ లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఆల్రెడీ రిలీజైన పోస్టర్లు, ప్రోమో కంటెంట్ సినిమాకు భారీ హైప్‌ను తీసుకురాగా, తాజాగా విడుదలైన టీజర్ ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది. మేకర్స్ ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా టీజర్‌ను రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. టీజర్లో కనిపించిన విజువల్ ట్రీట్, డార్క్ టోన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత ఎత్తుకు చేర్చాయి.
టీజర్లో యశ్ పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. క్రూరత్వాన్ని ప్రతిబింబించే సెటప్, గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్, హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా టీజర్ మొదలైన 20 సెకన్లకే చూపించిన ఓ బోల్డ్ షాట్ ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సీన్ కథలోని అడల్ట్ మరియు గ్రిటీ టోన్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. విజువల్స్ చూస్తుంటే ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదని, బలమైన భావోద్వేగాలు మరియు క్రైమ్ ఎలిమెంట్స్‌తో నిండిన కథ అని అర్థమవుతోంది.
20వ శతాబ్దం నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామాగా టాక్సిక్ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. యశ్ ఈ సినిమాలో రాయ అనే పాత్రలో కనిపించనున్నారు. టీజర్ చూస్తుంటే సినిమాలో యష్ క్యారెక్టర్ డార్క్ షేడ్స్‌తో పవర్ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. భారీ నిర్మాణ విలువలు, హాలీవుడ్ రేంజ్ మేకింగ్, విజువల్ ఎక్సలెన్స్ టాక్సిక్ ను పాన్ ఇండియా స్థాయిలో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 19న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

















