స్పిరిట్ పై అంచనాలు పెంచేసిన త్రిప్తి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్‌పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga) వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ తొలిసారి పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఇందులో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె తాజాగా సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కథ లేదా తన పాత్ర గురించి వివరాలు వెల్లడించకపోయినా, ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవంగా మారుతోందని ఆమె పేర్కొంది.
త్రిప్తి దిమ్రీ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన యానిమల్(Animal) ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి ప్రభాస్‌తో ఆమె జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా నెలకొంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్(Vivek Obera) విలన్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్(Prakash Raj), ఐశ్వర్య దేశాయ్(Aiswarya Desai), కాంచన(Kancha) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు బలమైన నటీనటుల బృందం మరింత ఆకర్షణగా మారింది.
టి-సిరీస్(T Series), భద్రకాళి పిక్చర్స్(Badrakali Pictures) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భూషణ్ కుమార్(Bushan Kumar), ప్రణయ్ రెడ్డి వంగా(Pranay Reddy Vanga), కృష్ణ కుమార్(Krishna Kumar), ప్రభాకర్ రెడ్డి వంగా(Prabhakar Reddy Vanga) నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామా మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా ఖరారు చేసిన మేకర్స్, 2027 మార్చి 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో ప్రభాస్ కెరీర్లో స్పిరిట్ మరో మైలురాయి అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.








