ఆదర్శ కుటుంబం ట్రైన్ ఎపిసోడ్‌పై భారీ బజ్!
విక్టరీ వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుండగా, ఆ కల ఇప్పుడు ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) రూపంలో నిజమవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ ఆఖరి దశకు చేరుకోగా, షూటింగ్లో తెరకెక్కించిన ఓ ప్రత్యేక ట్రైన్ ఎపిసోడ్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సుమారు 20 నిమిషాల పాటు సాగే ఈ ట్రైన్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని సమాచారం. త్రివిక్రమ్ తనకు ప్రత్యేకమైన డైలాగ్ హ్యూమర్‌కు తోడు పరిస్థితుల ఆధారంగా సాగే కామెడీని ఈ ఎపిసోడ్లో కొత్తగా మలిచినట్లు టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ తన టైమింగ్‌తో ఈ సీన్స్ ను మరింత ఎంటర్టైనింగ్గా మార్చారని, థియేటర్లలో ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ను బాగా అలరిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(haarika & Haassinee Creations) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తికానుంది. మరోవైపు వెంకటేష్ ఈ సినిమా నుంచి చిన్న బ్రేక్ తీసుకుని, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో చేయనున్న తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంకటేష్ నుంచి వరుసగా రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానుండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.








