ఆల్ఫాకు ప్రభాస్ విషెస్.. ఆలియా రియాక్షన్ ఏంటంటే?
డార్లింగ్ ప్రభాస్(Prabhas) మరోసారి తన సపోర్టివ్ నేచర్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. తన సినిమాలకే పరిమితం కాకుండా ఇతర హీరోలు, హీరోయిన్ల ప్రాజెక్ట్‌లకు కూడా సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇవ్వడం ఆయనకు కొత్త విషయం కాదు. తాజాగా ఆలియా భట్(Alia Bhatt) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆల్ఫా(Alpha) ట్రైలర్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. ముఖ్యంగా ఇటీవల ఆలియా పేరు కల్కి 2898 AD(Kalki2898AD) సీక్వెల్‌కు సంబంధించి వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభాస్ పోస్ట్ కు ఆలియా కూడా థ్యాంక్యూ, థ్యాంక్యూ, థ్యాంక్యూ సో మచ్ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.
ఇటీవల సినీ వర్గాల్లో ఆలియా భట్ కల్కి 2898 AD రెండో భాగంలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఆమె ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రభాస్ తాజా పోస్ట్‌ను ఈ రూమర్స్‌తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల డిస్కషన్స్ మొదలుపెట్టారు. అధికారిక సమాచారం వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ తన భారీ సినిమా స్పిరిట్(Spirit) షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత పూర్తి చేయాల్సిన ఫౌజీ(Fauzi) సినిమాపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ టార్గెట్ గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆల్ఫా సినిమాపై కూడా రిలీజ్ కు ముందే మంచి ఆసక్తి కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రిలీజ్ తర్వాత ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.








