రిషబ్ శెట్టికి టాలీవుడ్ నుంచి బడా ఆఫర్లు
విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన రిషబ్ శెట్టి(Rishab Shetty) రిక్కీ(Ricky) అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కిరిక్ పార్టీ(Kirrik party) సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది. డైరెక్టర్ గా రిషబ్ చేసింది తక్కువ సినిమాలే అయినా హీరో భిన్నమైన కథలతో మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా వచ్చిన కాంతార(Kanthara) సినిమా తనకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ ను ఇచ్చింది. కాంతార సినిమా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత రిషబ్ శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కాంతార సినిమాలో నటనకు గానూ నేషనల్ అవార్డు(National Award) కూడా అందుకున్నాడు రిషబ్.
ప్రస్తుతం కాంతార2(kanthara2)ను రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రిషబ్ కు టాలీవుడ్ లోని రెండు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి పాన్ ఇండియా సినిమాల కోసం అగ్రిమెంట్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) లో ఓ సినిమా కోసం నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఇప్పటికే రిషబ్ శెట్టికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. దీంతో పాటూ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో భారీ సినిమాగా రానున్న జై హనుమాన్(Jai Hanuman) లో హనుమంతుడి కోసం రిషబ్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. జై హనుమాన్ ను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ నిర్మించనుంది. వీలు చూసుకుని ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.













