మార్చిపైన ఆశలు పెట్టుకున్న టాలీవుడ్ హీరోలు
ఈ ఇయర్ లో సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో పెద్దగా సందడి కనిపించడం లేదు. ఫిబ్రవరి లో వచ్చిన సినిమాలేవీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడు ఫోకస్ మొత్తం మార్చి వైపు మళ్లింది. మార్చి నెలలో టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు రానున్నాయి. వాటిలో ఓ మూడు సినిమాలు వాటి హీరోల కెరీర్లకు అత్యంత కీలకం కానున్నాయి.
అవే ఆపరేషన్ వాలెంటైన్, భీమ, ఆ ఒక్కటి అడక్కు. వరుణ్ తేజ్, గోపీచంద్, అల్లరి నరేషన్ కెరీర్ కు ఈ సినిమాలు ఎంతో కీలకం. ఈ సినిమాలు హిట్ అయితే వారి కెరీర్ కు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఫ్లాప్ అయితే ఇబ్బందిగా కూడా మారే అవకాశముంది. ఒకప్పుడు మంచి హిట్లతో ఊపు మీదున్న వరుణ్ తేజ్ కు గత రెండేళ్లుగా ఫ్లాపులు పడుతున్నాయి. గని, ఎఫ్3, గాండీవధారి అర్జున సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా హిట్ అవడం వరుణ్ కు ఎంతో అవసరం.
ఇక గోపీచంద్ కు కూడా భీమ సినిమా ఎంత కీలకమో చెప్పాల్సిన పన్లేదు. గతేడాది తన నుంచి వచ్చిన రామబాణం సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈసారి కన్నడ డైరెక్టర్ హర్ష తో కలిసి భీష్మ అనే సినిమా చేశాడు గోపీచంద్. ట్రైలర్ చూస్తుంటే సినిమా కొత్తగా ఉండేలా అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అవడం గోపీ కెరీర్ కు చాలా అవసరం.
ఒకప్పుడు కామెడీ సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన అల్లరి నరేష్ కొంచెం గ్యాప్ తర్వాత నాంది అనే సీరియస్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ నరేష్ తన పాత స్టైల్ లోకి వచ్చి ఆ ఒక్కటి అడక్కు అనే కామెడీ సినిమా చేశాడు. ఈ సినిమా మళ్లీ తనకు కామెడీ ఇమేజ్ తెస్తుందని ఎంతో ఆశ పడుతున్నాడు నరేష్. మరి మార్చి నెల ఈ ముగ్గురు హీరోలకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.













