టిల్లూ ఇక సైలెంట్ గా ఉంటే కుదరదు!
స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న సినిమా టిల్లూ స్వ్కేర్. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ట్రైలర్ కూడా నెల రోజుల ముందుగానే వదిలారు. రిలీజ్ కు మరో 18 రోజులు మాత్రమే ఉంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడంతో సినిమా వాయిదా పడుతుందేమోనన్న అనుమానాలు ఆడియన్స్ లో వస్తున్నాయి.
అయితే పెండింగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉండటం వల్లే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రమోషన్స్ చేయకపోయినా కనీసం కౌంట్ డౌన్ పోస్టర్స్ అయినా రిలీజ్ చేస్తున్నారా అంటే అదీ లేదు. అసలే టిల్లూ స్వ్కేర్ కు పోటీ తీవ్రంగా ఉంది. ఓ వైపు పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ బరిలో ఉన్నాయి.
ఆ తర్వాత వారంలో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుంది. కాబట్టి సిద్దూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీడియా ముందుకొచ్చి టిల్లూ స్వ్కేర్ ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాలి. లేదంటే చాలా భారీగానే నష్టపోవాల్సి వస్తుంది. సినిమాకు ఎంత బజ్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ చాలా కీలకం. అలాంటిది ఈ టైమ్ లో చిత్ర యూనిట్ సైలెంట్ గా ఉంటే ఎలా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ చాలా క్రేజీగా జరుగుతున్నట్లు సమాచారం.













