ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న రవితేజ
ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలంతా కోట్లలో పారితోషికాలు తీసుకుంటున్నారు. అందరి కంటే ఎక్కువగా ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటున్నాడు. మామూలు హీరోలు కూడా వరుసగా రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయంటే చాలు రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారు. దీంతో సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోతుంది.
ముఖ్యంగా డిజిటల్ మార్కెట్ వచ్చాక ఓటీటీల నుంచి డిజిటల్ రైట్స్ రూపంలో కోట్ల రూపాయలు నిర్మాతలకు ముందుగానే వస్తుండటంతో హీరోలు కూడా తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు. మాస్ మహారాజా రవితేజ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు దాకా ఛార్జ్ చేస్తున్నాడట.
దీంతో ఆయన సినిమాల బడ్జెట్ రూ.40 కోట్లు దాటుతున్నాయి. కొన్ని సినిమాలకు ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. ఈ ఇయర్ రవితేజ నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండూ ఊహించని ఫలితాన్ని అందుకున్నాయి. అయినా కానీ రవితేజ తన తర్వాతి సినిమాకు రూ.25 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. మైత్రీ బ్యానర్ లో గోపీచంద్ సినిమా ఆగిపోవడానికి బడ్జెటే కారణమని అందరూ అంటున్నారు. అలాంటి టైమ్ లో కూడా రవితేజ రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోవడం వల్లే సినిమా హోల్డ్ అయిందని అందరూ అంటున్నారు.













