Laya: లయ స్లిమ్ గా ఉండటానికి కారణమదే

ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన లయ(Laya) సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లి చేసుకుని సినీ కెరీర్ ను వదిలేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత లయ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. నితిన్(Nithin) నటిస్తున్న తమ్ముడు(Thammudu) సినిమాతో లయ కంబ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా లయ మునుపెంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే ఉంది.
ప్రస్తుతం లయ ఏజ్ 43 ఏళ్లు. కానీ ఇప్పటికీ ఆమె మూడు పదుల వయసు భామలానే కనిపిస్తుంది. అయితే ఆమె అందానికి కారణమేంటని అడిగితే తాను మితంగా తింటానని, అందుకే అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నానని చెప్తోంది. పెళ్లికి ముందు నుంచి కూడా తక్కువగా తినడమే తనకు అలవాటని, ఇప్పటికీ తాను అదే కంటిన్యూ చేస్తున్నానని తెలిపింది లయ.
ఇప్పటివరకు తానెప్పుడూ కడుపు నిండుగా తిన్నది లేదని, అందుకే సన్నగా ఉన్నానని చెప్తోంది. దానికి తోడు ఆమె ఫుల్ వెజిటేరియన్ అట. అన్నం తక్కువగా అందులో పప్పు, కూర, పచ్చడి లాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకునే లయ ఏం తినాలన్నా తానే చేసుకుంటుందట. బయట ఫుడ్ అస్సలు ముట్టుకోదట. మితంగా తినడం వల్లే లయ ఇప్పటికీ స్లిమ్ గా ఉందన్నమాట.