The Paradise: ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని(nani) వరుస హిట్లతో మంచి స్పీడు మీదున్నాడు. హిట్3(hit3) సినిమాతో ఆఖరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(the paradise) సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నాని, శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన దసరా(Dasara) సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ప్యారడైజ్ పై అందరికీ మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా శ్రీకాంత్ ది ప్యారడైజ్ ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ది ప్యారడైజ్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుండగా, శ్రీకాంత్ ది ప్యారడైజ్ సినిమాతో బెస్ట్ అవుట్పుట్ ను డెలివరీ చేయబోతున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలోని సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, పాత్రలను నెక్ట్స్ లెవెల్ లో డిజైన్ చేశాడని, కాకపోతే షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉండటం వల్ల అనౌన్స్ చేసిన డేట్ కు రిలీజ్ కాదేమో అని అనుమానాలొస్తున్నాయి. కాగా శ్రీకాంత్ ఓ వైపు ఈ సినిమా షూటింగ్ ను చేస్తూనే గ్యాప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చెన్నై వెళ్లొస్తున్నాడని, ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని, డిసెంబర్ లో కానీ జనవరి మొదట్లో కానీ ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ రానుందని తెలుస్తోంది. అనిరుధ్(anirudh) సంగీతంలో వస్తున్న ఈ ఫస్ట్ సింగిల్ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ ఉంటుందని సమాచారం.






