లియో అసలు కాన్సెప్ట్ ఏంటంటే!
విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లో భాగంగా వస్తుంది. లియోలో సంజయ్ దత్ పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ మరో స్ట్రాంగ్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు.
విజయ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా లియో నిలిచింది. ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకు రూ.205 కోట్ల వరకు తిరిగి వచ్చింది. థియేటర్స్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. ఒక్క తెలుగులోనే 20 కోట్లకు ఈ హక్కులు అమ్ముడయ్యాయంటే లియో రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా స్టోరీలో కూతురు సెంటిమెంట్ చాలా కీలకంగా ఉండబోతుందట. దాంతో పాటూ మనీ చుట్టూ స్క్రీన్ ప్లే తిరుగుతుందని టాక్. ఈ అంశాలన్నీ లియో స్టోరీని డ్రైవ్ చేస్తూ సూపర్బ్ ఎలివేషన్స్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలవనుందని టాక్. సినిమాకు మంచి టాక్ వస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయంగా కనిపిస్తుంది.













