Kanthara Chapter1: కాంతార చాప్టర్1 ట్రైలర్ ను రెడీ చేస్తున్న మేకర్స్

2022లో చిన్న సినిమాగా రిలీజై దేశమంతటా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సినిమా కాంతార(kanthara). డివోషనల్ పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి(rishab shetty) హీరోగా నటించగా, ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్1(kanthara chapter1) వస్తోంది. అక్టోబర్ 2న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కూడా జరిగింది.
థియేట్రికల్ బిజినెస్ కూడా సుమారు రూ.100 కోట్లు జరిగిందని టాక్. కాంతార సినిమాకు దేశం మొత్తంలో మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ ను దాన్ని మించేలా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది.
ప్రస్తుతం కాంతార చాప్టర్1 ట్రైలర్ కట్ జరుగుతుందని, ఈ సినిమాకీ, ముందు సినిమాకీ ఎలాంటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ గా ఈ మూవీ ఉండనుందని, కాంతార చాప్టర్1 కథ పూర్తిగా కొత్తదని కన్నడ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్(hombale films) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్స్ ను కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.