AKhanda2: ఇంటర్వెల్ వీఎఫ్ఎక్స్ కు కళ్లు చెదరడం ఖాయమే!

బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(boyapati srinu) కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అఖండ2 తాండవం(akhanda2 thandavam). వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి అఖండ2ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడదే రోజున పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్న ఓజి(OG) సినిమా కూడా రిలీజవుతుండటంతో అఖండ2 వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ గురించి మంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అఖండ2 వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ జరుగుతున్నాయని, సినిమా ఇంటర్వెల్ లో వచ్చే వీఎఫ్ఎక్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.
వీఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే వీఎఫ్ఎక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(Samyuktha menon) హీరోయిన్లు గా నటిస్తుండగా తమన్(Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.